
2026 టి-20 ప్రపంచకప్ కోసం యావత్ ప్రపంచక్రికెట్ అబిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక టోర్నమెంట్‌లో ఆడే అన్ని దేశాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ ఏడాది ఇండియా, శ్రీలంక వేదికగా జరుగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగుతన్న నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఆ దేశ క్రికెట్ బోర్డుకు కీలక సూచనలు చేసందిట. భారత్‌లో జరిగే మ్యాచ్‌ల వేదకలను శ్రీలంకు మార్చలాని ఐసిసిని అభ్యర్థించాలని సూచించింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ధృవీకరించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)కి అధికారికంగా తెలయజేయాలని టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు ప్రత్యామ్నాయ వేదికగా శ్రీలంకను ప్రతిపాదించాలని తాత్కాలిక ప్రభుత్వం ఆదేశించిందని నజ్రుల్ వివరించారు.
ఇదిలా ఉండగానే టి-20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. ఐపిఎల్‌లో కెకెఆర్ జట్టుకు దూరమైన ముస్తాఫిజుర రెహమాన్‌కు టి-20 ప్రపంచకప్‌లో చోటు దక్కింది. ఈ జట్టుకు లిటన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పేస్ విభాగంలో రెహమాన్‌తో పాటు తస్కిన్ అహ్మద్‌కు చోటు దక్కింది. మోహదీ హసన్, రిషాద్ హొస్సేన్ ప్రధాన స్పిన్నర్లు. బ్యాటింగ్‌లో లిటన్ దాస్, తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్‌లపై బంగ్లా ఎక్కువగా ఆధారపడి ఉంది.
టి-20 ప్రపంచకప్‌కి బంగ్లాదేశ్ జట్టు: లిటన్ దాస్(కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, క్వాజి నూరుల్ హసన్ సోహన్, షాక్ మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమన్, తాంజిమ్ సోహన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షోరిఫుల్ ఇస్లాం.