Reading Time: < 1 minute

హైదరాబాద్: చికిత్స వికటించి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడలోని శ్రీసాయి కృష్ణ న్యూరో హాస్పిటల్ జరిగింది. సురేష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాచిగూడలోని సాయి కృష్ణ ఆస్పత్రిలో చేర్పించి అతడికి చికిత్స అందించారు. యువకుడి ప్రాణాపాయం లేదని వైద్యులు కూడా చెప్పారు. అప్పటివరకు బాగానే ఉన్నా యువకుడు ఉన్నట్టుండి మృతి చెందడంపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీశారు. సురేష్ కుటుంబ సభ్యులపై ఆస్పత్రి యాజమాన్యం దౌర్జన్యం చేయడంతో పోలీసుకలు ఫిర్యాదు చేసింది. రూ. 50 వేలను అడ్వాన్స్ తీసుకొని సురేష్ ను శ్రీకృష్ణ న్యూరో హాస్పిటల్ యాజమాన్యం అడ్మిన్ చేసుకుంది. ఇప్పుడు డెడ్ బాడీ ఇవ్వాలంటే కూడా డబ్బులు కట్టాలని, లేకుంటే బాడీని ఇవ్వమంటూ దౌర్జన్యానికి దిగింది.