Reading Time: < 1 minute

హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్, హీరో కాంబినేషన్‌లలో బోయపాటి, బాలకృష్ణల కాంబో ఒకటి. వీరిద్దరు కలిసి చేసిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఈ కాంబోలో వచ్చిన సినిమాల్లో 2021లో వచ్చిన ‘అఖండ’ కూడా ఒకటి. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ2-తాండవం’ సినిమా వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా విడుదలకు తొలుత అడ్డంకులు వచ్చినా.. ఆ తర్వాత అన్ని సమస్యలను క్లియర్ చేసుకొని విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.

నటుడిగా బాలకృష్ణ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. శతృదేశం ఓ జనని(హర్షాలీ మల్హోత్రా) అనే అమ్మాయిని ఓ కారణం వల్ల హతమార్చాలని చేసిన ప్రయత్నంలో రుద్ర సికిందర్ అఘోరా(బాలకృష్ణ) ఆ అమ్మాయిని ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా మూల కథ. సినిమాలో కొన్ని లాజిక్ లెస్ సీన్లు ఉన్నప్పటికీ.. బోయపాటి టేకింగ్, బాలకృష్ణ యాక్టింగ్‌తో వాటిని కన్విన్సింగ్‌గా మార్చారు. ఇక ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకులను అలరించి ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. తమన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది.