Reading Time: < 1 minute

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం అటవీ శాఖ విభాగంలో అనుమతుల నిమిత్తం రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన అటవీ శాఖలో ఒ క్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం అటవీ శాఖ విభాగానికి తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డిసి) పరిధిలో పనిచేస్తున్న రేంజ్ స్థాయి అధికారి ఒక కాం ట్రాక్టర్ నుండి జామాయిల్  కటింగ్ చేసిన బిల్లులను చెల్లించేందుకు 32వేల టన్నులకుగాను రూ.22 లక్షల 80 వేలు లంచం డిమాండ్ చేశా రు. జామాయిల్ కటింగ్‌కు టన్నుకు రూ.750 వంతున ప్రభుత్వం ఇస్తుండగా ఈ అధికారి మా త్రం టన్నుకు రూ.150 డిమాండ్ చేయగా రూ. 90 బేరం కుదిరింది. ఈ మేరకు మొదటి యూనిట్‌లో 3,900 టన్నుల కటింగ్ కాగా ఆ బిల్లులు చే సేందుకు రూ.3.50 లక్షలు లంచం శనివారం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సదరు అధికారి నివాసంతోపా టు అతని కార్యాలయంలో సోదాలు చేపట్టారు. పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకొని, సంబంధిత ఫైలు రికార్డులను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఖమ్మం ఎసిబి డిఎస్‌పి వై. రమేష్ తెలిపారు. ఈ దాడుల్లో ఎసిబి సిబ్బంది కూడా పాల్గొన్నారు.