Reading Time: < 1 minute

రాష్ట్రంలో పార్టీలు, వర్గాలకు అతీతంగా గృహ జ్యోతి పథకం అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ పథకం కింద ఎస్పీడీసీఎల్ పరిధిలో 25, 35, 560 మంది, ఎన్పీడీసీఎల్ పరిధిలో 27, 46, 938 కలిపి రాష్ట్రవ్యాప్తంగా 1.15 లక్షల కుటుంబాలు ఉండగా 52, 82, 498 కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని వివరించారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.3,593 వేల కోట్లు ఇప్పటివరకు ఆయా విద్యుత్ సంస్థలకు చెల్లించిందని తెలిపారు. శాసనసభలో శనివారం సభ్యులు జీ. మధుసూదన్ , నాగరాజు, కవంపల్లి సత్యనారాయణ, దానం నాగేందర్ తదితరులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సిఎం సమాధానం ఇచ్చారు.

కొత్తవారూ దరఖాస్తు చేసుకోవచ్చు

గృహజ్యోతి పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు, మార్పులు, చేర్పులు చేయించాలని అనుకునేవారు ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజా పాలన అధికారులను కలిసి కొత్తవారు దరఖాస్తు చేసుకోవచ్చు, పాతవారు వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని భట్టి వివరించారు