Reading Time: < 1 minute
Ajit Doval On Operation Sindoor Dont Mistake Indias Patience For Weakness

Ajit Doval: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్’ అనే డిస్కవరీ డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగంగా ప్రసారం కానుంది. రెండు భాగాలుగా వచ్చే ఈ డాక్యుమెంటరీ ఇది ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్, దాని స్ట్రీమింగ్ సర్వీస్ అయిన డిస్కవరీ+లో ప్రసారం అవుతుంది. 88 గంటల పాటు సాగిన ఈ సైనిక ఆపరేషన్ వెనక ఉన్న వ్యూహాలు, నిర్ణయ ప్రక్రియపై దోవల్ ఇందులో వివరించనున్నారు.

భారత్ సహనంగా ఉంటే దేశమైనప్పటికీ, ఇది బలహీన దేశం కాదని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ‘‘మా సహనాన్ని బలహీనతగా పొరబడకండి. భారత్ రిస్కులు తీసుకోగలదు. అవసరమైతే గట్టి దెబ్బకొట్టగలదు’’ అని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని దోవల్ వెల్లడించారు. భారత సైనిక, జాతీయ భద్రతా నాయకత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా ఈ డాక్యుమెంటరీ చూపించనుంది.

2025 ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన దారుణమై ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న ఆపరేషణ్ సిందూర్ చేపట్టారు. పాకిస్తాన్‌, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కు చెందిన ట్రైనింగ్ క్యాంపులు, కార్యాలయాలను ధ్వంసం చేశారు. పాక్ సైన్యం భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే, భారత్ తన క్షిపణులు, యుద్ధ విమానాలతో పాక్ ఎయిర్ ఫోర్స్ బేసుల్ని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ లోని 10కి పైగా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇందులో పాక్ ఎయిర్ ఫోర్స్, న్యూక్లియర్ కమాండ్ సెంటర్‌గా ఉన్న రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కూడా ఉంది. చివరకు పాక్ శరణు కోరడంతో కాల్పుల విరమణ జరిగింది. అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్థాన్‌ల మధ్య సైనిక ఘర్షణ దాదాపు 88 గంటల పాటు కొనసాగింది.