
Wamiqa Gabbi: బాలీవుడ్‌లో దాదాపు పదేళ్లుగా నటిస్తున్న వామిక గబ్బికి సరైన స్థాయిలో థియేట్రికల్ బ్రేక్ మాత్రం దక్కలేదు. టీవీ, ఓటీటీ, వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఆమె కెరీర్‌కు భారీ మలుపు మాత్రం రాలేదు. అయితే ఇటీవల వచ్చిన ఓ సౌత్ సినిమా వామిక గబ్బి కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల విడుదలైన ‘డీసీ’ సినిమాలో చంద్ర అనే కీలక పాత్రలో వామిక గబ్బి నటించింది. తన గ్లామర్‌తో పాటు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామకు ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ‘డీసీ’ సక్సెస్‌తో సౌత్ ఇండస్ట్రీలో వామికకు అవకాశాలు పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వామికకు వరుస ఆఫర్లు వస్తున్నాయట. ‘హనుమాన్’ సక్సెస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో రిషబ్ శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘జై హనుమాన్’లో వామిక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. టీ-సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ డివోషనల్ ఫాంటసీ యాక్షన్ డ్రామాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా, రానా దగ్గుబాటి అశ్వత్థామగా కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో వామిక పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్.
త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో వామిక గబ్బి జాయిన్ కానున్నట్లు సమాచారం. మరోవైపు అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ‘G2’లోనూ ఆమె నటిస్తోంది. ఇందులో మహాలక్ష్మి అనే పవర్‌ఫుల్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ వామిక వరుస అవకాశాలు అందుకుంటోంది. మలయాళంలో ‘టికీ టాకా’ సినిమాలో నటిస్తుండగా.. తమిళంలో జయం రవితో కలిసి ‘జీని’, ‘ఇరవ కాలం’ వంటి ప్రాజెక్టుల్లో భాగమవుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు సరైన థియేట్రికల్ బ్రేక్ కోసం ఎదురుచూసిన వామిక గబ్బి.. ఇప్పుడు సౌత్‌లో వరుస సినిమాలతో బిజీయెస్ట్ నటిగా మారుతోంది. ముఖ్యంగా ‘జై హనుమాన్’, ‘G2’ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఆమె కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్తాయనే అంచనాలు ఉన్నాయి.