Reading Time: < 1 minute

గ్లోబల్ యానిమే వేదికపై రెండోసారి రష్మిక

Caption of Image.

ఇటు సౌత్‌‌‌‌తో పాటు అటు బాలీవుడ్‌‌‌‌లోనూ హీరోయిన్‌‌‌‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించిన రష్మిక మందన్న.. మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరవబోతోంది. వచ్చే నెల 23న జపాన్‌‌‌‌ రాజధాని టోక్యోలో జరగనున్న ’10వ గ్లోబల్ యానిమే అవార్డ్స్’ వేడుకలో ఆమె అవార్డు ప్రజెంటర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించబోతోంది. యానిమే రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గౌరవించే ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రజెంటర్‌‌‌‌‌‌‌‌ హోదాలో రష్మిక మెరవడం ఇది రెండోసారి. 2024లోను ఈ అవార్డుల ప్రధోనోత్సవంలో పాల్గొని గ్లోబల్ యానిమే అవార్డ్స్‌‌‌‌కు ప్రజెంటర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది.

ఈ వేడుకలో రష్మికతో పాటు ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు ‘ది వీకెండ్’ కూడా ప్రజెంటర్‌‌‌‌గా హాజరుకానున్నారు. సంగీతం, సినిమా రంగాలకు చెందిన అంతర్జాతీయ దిగ్గజాలు పాల్గొనే  ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. ఈ వేడుకల కోసం మే మూడో వారంలో రష్మిక టోక్యో వెళ్లనుంది.  ప్రస్తుతం ఆమె ‘మైసా’ అనే లేడీ ఓరియంటెడ్‌‌‌‌ మూవీతో పాటు విజయ్ దేవరకొండకు జంటగా ‘రణబాలి’లో నటిస్తోంది. అలాగే షాహిద్‌‌‌‌ కపూర్‌‌‌‌,  కృతి సనన్‌‌‌‌లతో కలిసి నటించిన ‘కాక్ టెయిల్ 2’ జులై 19న విడుదల కానుంది.

©️ VIL Media Pvt Ltd.