Reading Time: < 1 minute

మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన సూపర్ లగ్జరీ బస్సు

Caption of Image.

మెదక్ జిల్లాలో  ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి మెదక్ వైపు వస్తున్న  సూపర్ లగ్జరీ బస్సు, కొల్చారం సమీపంలో ఎదురుగా వస్తున్న ధాన్యం లారీని బలంగా ఢీకొట్టింది. ఈ  ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల హాహాకారాలతో మిన్నంటాయి. స్థానికులు , పోలీసులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ధాన్యం లోడ్‌తో ఉన్న లారీని బస్సు ఢీకొట్టిన వేగానికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.