
టెన్త్ విద్యార్థులకు, పేరెంట్స్ కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 10వ తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ విద్యాశాఖ. 2026 ఏప్రిల్ 29న ( బుధవారం ) ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. మధ్యాహ్నం 2 గంటలకు SCERT ఫలితాలు విడుదల చేయనున్నారు.
మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 23 నాటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు.
అధికారిక వెబ్ సైట్: https://bse.telangana.gov.in/
లో ఫలితాలను చూడవచ్చు.
టెన్త్ రిజల్ట్స్ ముందుగా మే ఫస్ట్ వీక్ లో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ.. మూల్యాంకనం వేగవంతంగా పూర్తి కావడంతో ఏప్రిల్ 29 రిలీజ్ చేసేందుకు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ముఖ్యఅతిథిగా హాజరై ఫలితాలను విడదల చేయనున్నట్లు చెబుతున్నారు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంతో ఆలస్యం అయితే.. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న రిజల్ట్స్ వెలువడుతాయని చెబుతున్నారు.