Reading Time: < 1 minute

సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి మూడేండ్ల జైలు

Caption of Image.

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసి, ఆపై బెదిరింపులకు పాల్పడిన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్​ కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్​ ఉద్యోగి రేపాల సురేందర్​కు మూడేండ్ల జైలు శిక్ష విధిస్తూ గోదావరిఖని ప్రిన్సిపల్​ జ్యుడీషియల్​ ఫస్ట్​క్లాస్​ మెజిస్ట్రేట్​ వెంకట సచిన్​రెడ్డి సోమవారం తీర్పు చెప్పారు. 2016లో యైటింక్లయిన్​  కాలనీకి చెందిన దాడి లక్ష్మయ్య కొడుకు మధుకర్​కు సింగరేణిలో ఉద్యోగం పెట్టిస్తానని నమ్మబలికి సురేందర్​ రూ.11 లక్షలు తీసుకున్నాడు.

ఆ తర్వాత ఉద్యోగం పెట్టించకపోగా, సురేందర్​ తప్పించుకొని తిరిగాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని లక్ష్మయ్య, కుటుంబ సభ్యులు నిలదీయడంతో సురేందర్​ వారిని బెదిరించాడు. దీంతో బాధితులు గోదావరిఖని టూ టౌన్​ పోలీసులను ఆశ్రయించారు. అప్పటి ఎస్సై శ్రీనివాస్​ కేసు నమోదు చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశ పెట్టడంతో నేరం రుజువైంది. దీంతో సురేందర్​కు మూడేండ్ల జైలు, రూ. 4 వేల జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్​ తీర్పు చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.