
ఖిలా వరంగల్(మామునూరు), వెలుగు: వరంగల్ సెంట్రల్ జైలులో కొత్తగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ను సోమవారం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సెంట్రల్ జైలు నిర్మాణానికి 101 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. పీడీఎఫ్ నిధులతో పరిపాలన భవనం నిర్మించామని చెప్పారు. జైలు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా చూస్తానని తెలిపారు. వరంగల్ రేంజ్ డీఐజీ ఎం సంపత్, వరంగల్ పర్యవేక్షణ అధికారి టి కళాసాగర్, ఉప పర్యవేక్షణ అధికారులు పీవీ వెంకటేశ్వర స్వామి, ఎం జ్యోతి, జైలర్ కె పూర్ణచందర్ పాల్గొన్నారు.
పెట్రోల్ బంక్ ప్రారంభం..
నర్సంపేట: వరంగల్ జిల్లా ఖానాపురంలో తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐవోసీఎల్ పెట్రోల్ బంక్‌ను జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్మ మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జైలు నుంచి విడుదలైనఖైదీలకు పునరావాసం కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నర్సంపేట మహిళా జిల్లా జైలును సందర్శించారు. జైలులో వసతి, సౌకర్యాలు, ఖైదీల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఐవోసీఎల్ డివిజనల్ రిటైల్ హెడ్ శరత్, వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ పాల్గొన్నారు.