Reading Time: 2 minutes

ఇండియా పంట పడింది: లిబియాలో భారీ ఆయిల్ నిల్వలు గుర్తింపు.. కష్టకాలంలో గుడ్ న్యూస్

Caption of Image.

ఇండియాకు పెద్ద గుడ్ న్యూస్. ఇంధనం కొరత అల్లాడిపోతున్న దేశానికి పెద్ద ఊరట. లిబియా దేశంలో జరుగుతున్న ఆయిల్ ఆన్వేషణలో బిగ్ అప్ డేట్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో లిబియాలో చేపట్టిన ఇంధన అన్వేషణ కొలిక్కి వచ్చింది. 6 వేల 600 చదరపు కిలోమీటర్ల పరిధిలో అతి పెద్ద ఆయిల్ రిజర్వ్‎లను గుర్తించింది ఈ సంస్థ. 

సోనాట్రాచ్ ఇంటర్నేషనల్ పెట్రోలియం ఎక్స్ ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కార్పొరేషన్ కంపెనీతో కలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్ చేపడుతుంది. ఇందులో భాగంగా నైరుతి లిబియాలోని ఘడమేస్ బేసిన్‎లో ఉన్న లీర ప్రాంత బ్లాక్ ఏరియాలో భారీ ఎత్తున ఇంధనం ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది IOC. ఈ ప్రాజెక్ట్‎కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రస్తుతం ఇంధన సంక్షోభం నెలకొంది. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు. ఇండియా ముడి చమురు కోసం ఎక్కువగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతోంది. మిడిల్ ఈస్ట్ వార్‎తో గల్ఫ్ నుంచి చమురు రవాణా స్తంభించిపోయింది. దీంతో దేశంలో ఆయిల్ షార్టేజ్ ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) గుడ్ న్యూస్ చెప్పింది. 

అంతర్జాతీయ అన్వేషణ రంగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. సోనాట్రాచ్ ఇంటర్నేషనల్ పెట్రోలియం ఎక్స్ ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కార్పొరేషన్ కంపెనీతో కలిసి లిబియాలో చేపట్టిన ప్రాజెక్టులో భారీగా చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నట్లు ఐవోసీ ప్రకటించింది. 

భారత స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీ అయిన ఐవోసీ సెబీ నిబంధనల ప్రకారం 2026, ఏప్రిల్ 27న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, బీఎస్ఈ లిమిటెడ్‌కు ఈ సమాచారాన్ని తెలియజేసింది. హైడ్రోకార్బన్ నిల్వలకు ప్రసిద్ధి చెందిన నైరుతి లిబియాలోని ఘడమేస్ బేసిన్‌లో ఉన్న తీరప్రాంత బ్లాక్ ఏరియా 95/96 లో  పెద్ద ఎత్తున ఆయిల్ రిజర్వ్‎లను గుర్తించిన తెలిపింది. ఈ బ్లాక్ సుమారు 6,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం ఈ బ్లాక్‎ను సోనాట్రాచ్ ఇంటర్నేషనల్ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. 

ఈ కన్సార్టియంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‎కు 25 శాతం వాటా ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 8 బావుల్లో ఆయిల్ అన్వేషణలు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే ఐదు బావులను తవ్వగా అనేక చమురు, గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. తాజాగా ఆరవ బావిలో కూడా భారీగా చమురు, గ్యాస్ నిక్షేపాలు కనుగొనబడ్డాయి. ఈ విషయాన్ని లిబియాకు చెందిన నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ అధికారికంగా ధృవీకరించింది.

అంతర్జాతీయ ఆయిల్ వ్యాపారాన్ని బలోపేతం చేసుకోవడంలో ఈ ఆవిష్కరణ చాలా కీలకమని ఇండియన్ ఆయిల్ పేర్కొంది. గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అధిక సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో తమ అన్వేషణను కొనసాగించాలనే వ్యూహానికి ఇది మరింత ఊతమిస్తుందని కంపెనీ భావిస్తోంది.

 

©️ VIL Media Pvt Ltd.