Reading Time: < 1 minute

వెధవలకు అంతా వెధవల్లానే కనిపిస్తరు: కేసీఆర్‎కు సీఎం రేవంత్ కౌంటర్

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణ విభజనపై లోక్ సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వివాదస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్ వెధవలు అడ్డుకోలేదన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్‎లో తెలంగాణ విభజనను పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీలు కౌంటర్ ఇచ్చారు. అది బీఆర్ఎస్ వెధవలకు వినిపించలేదా.. కనిపించలేదా..? అని ప్రశ్నించారు. వెధవలకు అంతా వెధవల్లానే కనిపిస్తారని కేసీఆర్ వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. 

బీఆర్ఎస్ చచ్చినా శవం

పర్పస్ సాల్వ్ అయ్యాక ఏ సిస్టమ్ అయినా డిసాల్వ్ అవుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ పర్పస్ కూడా సాల్వ్ అయింది ఇక ఆ పార్టీ మనుగడలో లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక చచ్చినా శవం లాంటింది.. చనిపోయిన శవానికి వైద్యం చేసినా వృధా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ గతం.. ఆ పార్టీకి ఇక భవిష్యత్ ఉండదని అన్నారు. 

పదేళ్లు అధికారం అడ్డం పెట్టుకుని అహంకారంతో పని చేశారు.. కానీ అప్పట్లో ప్రజలు చూసిచూడనట్లు వదిలేశారు. ఇక, కుటుంబ పార్టీతో అవసరం లేదని ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారన్నారు. కేసీఆర్‎కు తెలంగాణ ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి.. కుటుంబ అవసరాల కోసమే ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. 

ALSO READ : తెలంగాణలో ఏం జరుగుతుందో అర్ధమైతలే..

కేసీఆర్ చావును మేం ఎప్పుడూ కోరుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కేసీఆర్ ఆస్పత్రిలో చేరితే మొదట కలసి వచ్చింది తానేనని గుర్తు చేశారు. కేసీఆర్ చనిపోతే నాకేం వస్తది.. ఆయన ఆస్తులు,  ఫార్మ్ హౌజ్ నాకు రావు కదా అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. కేసీఆర్ ఉండగానే బాహాటంగా కేటీఆర్ సీఎం అని పార్టీలో చర్చ మొదలు పెట్టారన్నారు. 

©️ VIL Media Pvt Ltd.