
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ (Mehreen).. తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే తన ప్రియుడు అర్ష్ ఔలఖ్‌తో వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ జంట ఏప్రిల్ 26, 2026న హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన చైల్ పర్వత ప్రాంతంలో సన్నిహితుల సమక్షంలో ఆత్మీయంగా పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా మెహ్రీన్ ఇన్‌స్టాలో “26.04.26” అంటూ ఇన్ఫినిటీ, రెడ్ హార్ట్, ఈవిల్ ఐ ఎమోజీలతో ఫోటోలు షేర్ చేసింది.
ఈ ఫోటోలలో మెహ్రీన్ బ్లష్ పింక్ లెహంగా ధరించి అందంగా మెరిసింది. స్టోన్ జ్యువెలరీ, మాంగ్ టిక్కాతో స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ క్రమంలోనే సినీ ఫ్యాన్స్ మరియు సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వారిలో శ్రీనిధి శెట్టి, అనసూయ భరద్వాజ్, హన్సిక మోత్వాని, సోనాల్ చౌహాన్, నిధి అగర్వాల్ మరియు అనురాగ్ కశ్యప్ తదితరులు విషెస్ తెలిపారు.
ALSO READ : నన్ను చూసి నవ్వారు.. హీరో మెటీరియల్ కాదన్నారు..
ఇకపోతే మెహ్రీన్ భర్త అరష్ సోషల్ మీడియాలో చాలా ప్రైవేట్‌గా ఉంటారని సమాచారం. అతనికి 525 మందికి పైగా ఫాలోవర్లు మరియు కొన్ని పోస్టులు మాత్రమే ఉన్నాయి. అయితే, ఆయన ప్రొఫైల్‌లో “Cars and Travel” అని ఉంది. సిక్కు సంప్రదాయం ప్రకారం.. వీరి వివాహం జరిగింది.
మెహ్రీన్ సినిమాలు..
మెహ్రీన్ తెలుగు సినిమాల్లో ‘జవాన్’, ‘పంతం’, ‘కవచం’, ‘రాజా ది గ్రేట్’, ‘మహానుభావుడు’, ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ అలాగే F2&F3వంటి చిత్రాల్లో నటించింది. త్వరలో ఆమె కన్నడలో ‘నీ సిగూవరేగు’ సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇటీవల ఆమె ‘ఇంద్ర’ అనే హారర్ థ్రిల్లర్‌లో కనిపించింది.