Reading Time: 2 minutes

Summer Breakfast : ఇవి తింటే నీరసమే రాదు.. బలం వస్తుంది.. కడుపు మొత్తం క్లీన్

Caption of Image.

ఎండాకాలం నీరసంగా ఉంటుంది.  చిన్నపాటి పనికే అలసట వస్తుంది. అందులోనూ పిల్లలకు హాలిడేస్​.. బాగా అల్లరి చేస్తుంటారు… ఎండల్లో తిరుగుతుంటారు. ఇమ్యూనిటి పవర్​ కోల్పోతారు.  అలా కాకుండా.. చల్లగా.. రుచిగా.. బలమైన పోషకాలున్న బొబ్బర్ల గారెలు బ్రేక్​ ఫాస్ట్​గా తింటే  ఆరోగ్యంగా ఉంటారు.  అంతేకాదు.. కడుపును శుభ్రంగా క్లీన్​ చేసే పవర్​ బొబ్బర్లకు ఉంటుంది.  ఇంతటి పవర్​ ఫుల్​ బొబ్బర్లతో గారెలు ఎలా తయారు చేసేందుకు  ఏమేమి కావాలి.. ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

బొబ్బర్ల వడలకు కావాల్సిన పదార్దాలు  

  • బొబ్బర్లు : ఒక కప్పు
  • ఉల్లిపాయలు: రెండు ( సన్నగాతరిగినవి)
  • పచ్చిమిర్చి : మూడు (సన్నగా తరగాలి)
  • అల్లం: కొద్దిగా 
  • కరివేపాకు : నాలుగు రెమ్మలు  
  • కొత్తిమీర : అరకట్ట 
  • జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్  
  • ఉప్పు : సరిపడ
  • నూనె: వేగించడానికి సరిపడ

బొబ్బర్లు గారెలు  తయారీ విధానం 

బొబ్బర్లను శుభ్రం చేసుకోవాలి.   తరువాత వాటిని ఒక గిన్నెలో  తీసుకొని నీళ్లు పోయాలి.  నీళ్లతో శుభ్రంగా కడిగిన తరువాత.. దాదాపు 8 గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి.  రాత్రి నానబెట్టి పొద్దున్నే గ్రైండ్​ చేస్తే బెటర్​. మిక్సీలో గ్రైండ్​ చేసేటప్పుడు ఎక్కువుగా నీళ్లు వాడవద్దు. మరీ పల్చగా ఉండకూడదు.  గారెల పిండిమాదిరిగా ఉండాలి.

ఆ తరువాత ఈ పిండిలో  కరివేపాకు, కొత్తిమీర, అల్లం, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి  బాగా కలపాలి. గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఆ తరువాత జిలకర్ర, ఉప్పు వేపి బాగా మిక్స్​ చేయాలి.

ALSO READ : షుగర్ ఉన్నవారు పండ్లు తినకూడదా..?

 ఈ పేస్ట్‌ మిశ్రమంలో ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర  అల్లం ముక్కలను సన్నగా తరిగి  అందులో కలుపుకోవాలి.  మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి, ఇప్పుడు  జీలకర్ర, ఉప్పు కూడా వేసి వీటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. 

 ఇప్పుడు స్టవ్​ వెలిగించి పాన్​ లో నూనె పోసి వేడి చేయాలి. నూనె ఒక మాదిరిగా కాగిన తరువాత… చేతులకు నూనె రాసుకొని గారెల మాదిరిగా తయారు చేసుకొని మీడియం మంటపై గోల్డ్​ రంగులోకి మారే వరకు  నూనెలో వేగించాలి. రుచిగా.. ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ నూనెను ఉపయోగించండి. ఇలా చేస్తే బొబ్బర్ల గారెలు చాలా రుచిగా ఉంటాయి. 

©️ VIL Media Pvt Ltd.