Reading Time: 2 minutes

‘Biker’ OTT Release: ఓటీటీలోకి శర్వానంద్ ‘బైకర్’.. థ్రిల్లింగ్ రేసింగ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Caption of Image.

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గత కొంతకాలంగా విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.  ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా నిలిచిన ‘బైకర్’ (Biker).  ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ దునియాలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు దక్కించుకుంది.

మే 1 నుండి స్ట్రీమింగ్!

థియేటర్లలో రన్ ముగించుకున్న ‘బైకర్’, మే 1, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఇక హిందీ వెర్షన్‌ను ‘శర్వా’ (Sharwa) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో విడుదల చేస్తున్నారు.

తొలి మోటోక్రాస్ సినిమా

దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం, భారతదేశంలోనే మొట్టమొదటి మోటోక్రాస్ (Motocross) నేపథ్య సినిమాగా రికార్డు సృష్టించింది. కేవలం బైక్ రేసింగ్ మాత్రమే కాకుండా, ఒక ప్రొఫెషనల్ రేసర్ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, భావోద్వేగాలను దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు. అంతే కాకుండా ఈ బైక్ రేసింగ్ నేపథ్యానికి బలమైన తండ్రికొడుకుల సెంటిమెంట్ ను జోడించారు.

కథా నేపథ్యం.. 

‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మోటోక్రాస్ రేసింగ్‌లో శిక్షణ పొందారు. ఆయన బాడీ లాంగ్వేజ్, రేసింగ్ సీక్వెన్స్‌లలో చూపిన ఈజ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సినిమాకు ప్రధాన బలం శర్వానంద్ , రాజశేఖర్ మధ్య సాగే తండ్రి-కొడుకుల బంధం. వికాస్ నారాయణ్ (శర్వానంద్) ఒక బైక్ రేసర్‌గా తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) తో ఎదురయ్యే సంఘర్షణలు, క్రమశిక్షణ,పట్టుదల వంటి అంశాలను ఎంతో హృద్యంగా చూపించారు. శర్వానంద్ రేసర్‌గా అద్భుతమైన నటన కనబరచగా, రాజశేఖర్ తన సీనియారిటీతో పాత్రకు ప్రాణం పోశారు. మాళవిక నాయర్ ,అతుల్ కుల్కర్ణి కీలక పాత్రల్లో మెప్పించారు.  బైక్ రేసింగ్ సీక్వెన్స్‌లు చాలా నేచురల్‌గా, హై-వోల్టేజ్ యాక్షన్‌తో ప్రేక్షకులకు కిక్ ఇస్తున్నాయి.

సినిమాలో వాడిన కెమెరా వర్క్, సౌండ్ డిజైన్ రేసింగ్ ట్రాక్‌పై ఉన్న ఫీల్‌ను థియేటర్లలో అందించాయి. ముఖ్యంగా ఘిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసింది.  సీనియర్ హీరో రాజశేఖర్ తో పాటు అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ, శశాంక్ వంటి నటులు తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. యువి క్రియేషన్స్ (UV Creations) నిర్మాణ విలువలు సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాయి..

 

©️ VIL Media Pvt Ltd.