Reading Time: < 1 minute

తెలంగాణలో ఆగ్రో డీలర్ల సమ్మెబాట..

Caption of Image.

తెలంగాణలో ఆగ్రోడీలర్లు సమ్మెబాట పట్టారు. ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బంద్ కు మద్దతు ఇస్తా ఉన్నట్లు ప్రకటించారు. కంపెనీలకు, రైతులకు ఇబ్బంది పెట్టేలా ఉన్న అంశాలను రద్దు చేయాలని, లారీల్లో రవాణా చార్జీలు తగ్గించాలని, డీలర్ మార్జిన్ 8 శాతానికి పెంచాలనే డిమాండ్లతో సమ్మెకు దిగినట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. సోమవారం (ఏప్రిల్ 27)న నిర్మల్ జిల్లాలో దుకాణాలు ఒక రోజు బందు పెడుతున్నట్లు ప్రకటించారు.  అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమ్మెకు మద్ధతుగా షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో షాపులు మూసివేసి ఆందోళన నిర్వహించారు.

ఆగ్రో డీలర్ల సంఘం డిమాండ్లు:

  • ఎరువుల కంపెనీలు ఎఫ్ ఓ ఏ ఇవ్వకుండా డీలర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి
  • 266 రూపాయలు ఎమ్మార్పీ ఉంటే.. అమ్మ వలసిన యూరియా రూ.300 వరకు పెంచి అమ్మాల్సి వస్తుంది.
  • ప్రభుత్వానికి సప్లై చేసిన ఎరువుల కంపెనీలు ఎఫ్ఓఏలు ఇస్తున్నాయి
  • ప్రవేట్ డీలర్స్ సప్లై చేసే వాళ్లకు ఎఫ్ఓఏలు ఇవ్వడం లేదు
  • డీలర్స్ ని ఇబ్బంది పెట్టె కంపెనీల పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం
  • అవసరం లేని లింక్ ప్రోడక్ట్ ను వెంటనే రద్దు చేయాలి.
  • ప్రభుత్వం వెంటనే డీలర్ల ఇబ్బందులపై దృష్టి సారించి సమస్యలు పరిష్కానికి కృషి చేయాలి….
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు ఉండి, మాకు ప్రమేయం లేని తయారీ కంపెనీ ల పై తీసుకోవాల్సిన చర్యలు మా పై తీసుకుంటున్నారు…
  • గ్రామాల్లో లూజ్ విత్తనాల వల్ల రైతులకు ఎంతో నష్టం జరుగుతుంది, వాటిపై పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం….
  • గ్రామాల్లో విచ్చలవిడిగా లైసెన్సులు, జారీ అవుతున్నాయి, అవగాహన లేని వారు లైసెన్సులు పొందుతున్నారు.
  • ఎరువులు, పురుగు మందుల పై అవగాహన లేని వారికి లైసెన్సులు ఇవ్వదు
©️ VIL Media Pvt Ltd.