Reading Time: < 1 minute

పెళ్లి పేరుతో రూ.9.35 కోట్లకు ముంచేసిందనే ఆరోపణలపై స్పందించిన అషు రెడ్డి

Caption of Image.

హైదరాబాద్: పెళ్లి పేరుతో రూ.9.35 కోట్లు తీసుకుని మోసం చేసిందనే ఆరోపణలపై అషు రెడ్డి స్పందించింది. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా.. ఇష్టా రీతిన వార్తలను, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించింది. లండన్‌లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వై. వి. ధర్మేంద్ర.. 2018లో తను ఇండియాకు వచ్చినప్పుడు నటి అన్షు రెడ్డితో పరిచయమైంది.

అషు రెడ్డి ఈ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని.. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి విడతల వారీగా రూ.9.35 కోట్లు తన నుంచి దండుకుందని.. ఈ డబ్బులు కాజేసిన వ్యవహారంలో అషు రెడ్డి కుటుంబం పాత్ర కూడా ఉందని బాధితుడు ఆరోపించాడు. లండన్‏లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు వై.వి.ధర్మేంద్రను ప్రేమ, పెళ్లి పేరుతో నటి అషు రెడ్డి మోసం చేసిందని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

2018లో ఇండియాకు వచ్చిన సమయంలో తన కుమారుడికి అషురెడ్డితో పరిచయం ఏర్పడిందని.. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుందామని నమ్మించి ఆర్థిక అవసరాలు తీర్చుకుందని ఆరోపించారు. బంగారం, ఖరీదైన ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసిందన్నారు. తన కొడుకు దగ్గరి నుంచి పలు దఫాల్లో సుమారు రూ.9.5 కోట్ల రూపాయలు అషు రెడ్డి కాజేసిందని ఆరోపించారు.

అషు రెడ్డి ఫ్యామిలీ కూడా మొదట్లో పెళ్లికి ఒప్పుకుని ఆ తర్వాత ముఖం చాటేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు నటి అషు రెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు చేసు నమోదు చేశారు. చీటింగ్ ఆరోపణలపై అషు రెడ్డి మీద కేసు నమోదు కావడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

©️ VIL Media Pvt Ltd.