
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బృందావనం ప్రాంతంలో దాదాపు 12 ఎకరాల్లో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆఫీసర్లను ఆదేశించారు. కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో యువజన, క్రీడా శాఖల అధికారి, పలు క్రీడా సాంఘాల ప్రతినిధులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు.
క్రీడా ప్రాంగణలో 400 మీటర్ల అథ్లెటిక్స్, సింథటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం నిర్మాణాలకు అవసరమైన డీపీఆర్లను సిద్ధం చేయాలన్నారు. పాల్వంచలోని శ్రీనివాస కాలనీ గ్రౌండ్లో 200మీటర్ల సింథటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం నిర్మించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్
గణేశ్ పాల్గొన్నారు.