Reading Time: < 1 minute

NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: బీఈ/బీటెక్ అర్హతతో అద్భుత అవకాశం!

Caption of Image.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 23న ప్రారంభమై మే 7న  ముగుస్తుంది. 

పోస్టు పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్).

మొత్తం పోస్టులు: 250. (అన్ రిజర్వ్డ్ 109, ఈడబ్ల్యూఎస్ 25, ఓబీసీ 39, ఎస్సీ 42, ఎస్టీ 35).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 40 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 23. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు 
ఉంటుంది. 

లాస్ట్ డేట్: మే 7.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్/ స్క్రీనింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ careers.ntpc.co.inను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.