Reading Time: 2 minutes

ViralVideo: డేటింగ్‌లో విజయ్ వర్మ.. తమన్నా తర్వాత మరో బ్యూటీ.. ఎవరీ ఆలియా ఖురేషి?

Caption of Image.

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా భాటియా మధ్య ఉన్న కెమిస్ట్రీ ఒకప్పుడు ఎంతో చర్చనీయాంశమైంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సమయంలో మొదలైన వారి ప్రేమకథ దాదాపు రెండేళ్ల పాటు హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే 2025 మార్చిలో ఈ జంట విడిపోయినట్టు వార్తలు రావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ బ్రేకప్‌పై ఇప్పటివరకు ఇద్దరూ అధికారికంగా స్పందించకపోయినా, వారు విడిపోయారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే, లేటెస్ట్గా విజయ్ వర్మ (Vijay Varma).. మరో నటితో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ముంబైలో విజయ్ వర్మ, బాలీవుడ్ బ్యూటీ ఆలియా ఖురేషితో కలిసి డిన్నర్‌కు వెళ్లిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇద్దరూ కలిసి బయటకు రావడం, ఒకే కారులో చనువుగా వెళ్లడం వంటి ఫోటోలు, వీడియోలు ఈ రూమర్స్‌కు బలాన్ని చేకూర్చాయి. గతంలో కూడా విజయ్ వర్మ, ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలతో ఆలియా ఖురేషితో కొత్త రిలేషన్‌షిప్ ప్రారంభమైందా అనే అనుమానాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఎవరీ బ్యూటీ ఆలియా ఖురేషి..?

ఆలియా ఖురేషి (Aaliyah Qureishi) బాలీవుడ్‌లో విభిన్న రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తోంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా సింగర్‌, లిరిసిస్ట్‌గా కూడా మంచి గుర్తింపు పొందుతోంది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ‘జాన్వి’ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది.

ఆ తర్వాత ‘బందిష్ బాండిట్స్’ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే విజయ్ వర్మతో కలిసి ‘మట్కా కింగ్’లో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి ఆదరణతో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడీ డిన్నర్ మీట్ ‘మట్కా కింగ్’ సక్సెస్ సందర్భంగా జరిగిందా? లేక వీరిద్దరి మధ్య నిజంగానే కొత్త బంధం మొదలైందా? అన్నది తెలియాల్సి ఉంది.

©️ VIL Media Pvt Ltd.