
హైదరాబాద్లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఎన్ఐఎంహెచ్) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: సీనియర్ రీసెర్చ్ ఫెలో.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎలిజిబిలిటీ
ఎస్ఆర్ఎఫ్ (బోటనీ): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి వృక్షశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. రెండేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి.
ఎస్ఆర్ఎఫ్(ఐటీ): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ/ బి.టెక్ (కంప్యూటర్ సైన్స్) లేదా ఎంసీఏతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. పరిశోధన అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 21.
లాస్ట్ డేట్: మే 6.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 8.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nimh.nih.gov ను సందర్శించండి.