Reading Time: < 1 minute

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతల నిరసన

Caption of Image.

కూకట్​పల్లి/ షాద్ నగర్, వెలుగు: ప్రధాని మోదీని ఉగ్రవాదితో పోలుస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైరయ్యారు. బుధవారం కూకట్ పల్లిలోని వివేకానందనగర్ జాతీయ రహదారిపై బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వంశీరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ నిరసనతో కూకట్ పల్లి నుంచి జేఎన్టీయూ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. షాద్ నగర్ చౌరస్తాలో బీజేపీ ఇన్​చార్జీ అందే బాబయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ గుప్త నేతృత్వంలో ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి అంకితభావంతో సేవలందిస్తున్న ప్రధానిపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం దేశద్రోహంతో సమానమని, భవిష్యత్తులో ప్రజలే కాంగ్రెస్​కు తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు.

©️ VIL Media Pvt Ltd.