
గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం అండతో నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామన్నారు.
బుధవారం గ్రేటర్ సిటీలోని 58వ డివిజన్ పరిధిలో రూ.72లక్షలతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, రోడ్డు విస్తరణ పనులకు బల్దియా మేయర్ గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్మడి లోహిత, మాజీ కార్పొరేటర్ నాగరాజు, డివిజన్ అధ్యక్షుడు సుధాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.