Reading Time: < 1 minute

కోర్టు తీర్పుపై సంబురాలు ఏంటి?…మీరు సంతోషించాల్సిన స్థాయిలో తీర్పు లేదు: చామల

Caption of Image.

హైదరాబాద్,వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ రిపోర్టును హైకోర్టు ఎక్కడా తప్పుపట్టలేదని, అయినా బీఆర్ఎ స్ నేతలు ఈ తీర్పుపై ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారో వారికైనా అర్థమైందో లేదోనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

బీఆర్ఎస్ సంబురాలు చేసుకునే స్థాయిలో కోర్టు తీర్పు ఏమిలేదని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత దీనిపై ఎలా ముందుకెళ్లాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కాళేశ్వరం విషయంలో  బీఆర్ఎస్‌‌‌‌కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందో లేదో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‌‌‌ చెప్పాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.