Reading Time: < 1 minute

తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్… ఓటేసిన ప్రముఖులు

Caption of Image.

తమిళనాడు అసెంబ్లీ  ఎన్నికల్ పోలింగ్  కొనసాగుతోంది. గురువారం(ఏప్రిల్24) ఉదయం 7 గంటలనుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. తమిళనాడుకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించారు. 

సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం శివగంగలోని కారైకుడిలో ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుని, సిరా గుర్తు ఉన్న తన వేలిని చూపించారు. ఎఐఎడిఎంకె జనరల్ సెక్రటరీ, లోపి ఎఐఎడిఎంకె అభ్యర్థి కె. పళనిస్వామి సిలువంపాళయంలోని పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు.MNM అధినేత, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి ఆల్వార్‌పేట పాఠశాలలో క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. 

తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ మైలాపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్, చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక సినీ ప్రముఖలలో ప్రముఖ నటుడు అజిత్ కుమార్, గౌతమ్ రామ్  కార్తీక్  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఓ పోలింగ్ కేంద్రంలో అజిత్ కుమార్ తన ఓటు వేశారు.నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

©️ VIL Media Pvt Ltd.