
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈసారి అది సినిమా గురించి కాదు, ఆయన విలాసవంతమైన జీవనశైలి గురించి. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో బన్నీ ఒక అల్ట్రా-లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా షూటింగ్స్ కోసం స్టార్లు హోటల్స్‌లో బస చేస్తారు, కానీ బన్నీ మాత్రం ఏకంగా ఒక ప్యాలెస్ లాంటి ఇంటినే సిద్ధం చేసుకున్నారు.
సముద్రపు ఒడ్డున 5 BHK ప్యాలెస్!
ముంబైలోని సెలబ్రిటీల అడ్డా అయిన జుహూ తారా రోడ్‌లో ఒక అద్భుతమైన సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌ను అల్లు అర్జున్ లీజుకు తీసుకున్నారు. దాదాపు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి విశేషాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ 5 BHK ఫ్లాట్ అద్దె నెలకు ఏకంగా రూ. 16 లక్షలు అని సమాచారం. అరేబియా సముద్రం కనిపిస్తూ, ప్రైవేట్ ప్లంజ్ పూల్ , నాలుగు కార్ల పార్కింగ్ సౌకర్యంతో ఉన్న ఈ ప్రాపర్టీ విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా.
స్నేహా రెడ్డి పర్యవేక్షణలో ఇంటీరియర్స్
ఈ ఇంటిని కేవలం అద్దెకు తీసుకోవడమే కాదు, తన అభిరుచికి తగ్గట్టుగా బన్నీ భార్య అల్లు స్నేహా రెడ్డి దగ్గరుండి ఇంటీరియర్స్‌ను డిజైన్ చేయించినట్లు సమాచారం. ఏడాది క్రితమే ఈ డీల్ కుదిరినప్పటికీ, పిల్లలు అయాన్, అర్హలకు సెలవుల సమయంలో ఇది ఒక పర్ఫెక్ట్ హాలిడే హోమ్ లా ఉండేలా.. పచ్చదనం, ప్రశాంతత ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దారు.
అల్లు అరవింద్ క్లారిటీ!
బన్నీ ముంబైలో ఇల్లు తీసుకున్నారనే వార్త రాగానే, ఆయన బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోతున్నారనే రూమర్స్ వచ్చాయి. దీనిపై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. బన్నీకి హైదరాబాద్‌లోనే సొంతిల్లు ఉంది, స్నేహితులు ఇక్కడే ఉన్నారు, పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. షూటింగ్స్ కోసం ముంబైలో ఎక్కువ సమయం గడపాల్సి రావడంతోనే ఈ ఏర్పాటు చేసుకున్నారు తప్ప, అక్కడ స్థిరపడాలనే ఆలోచన లేదు అని స్పష్టం చేశారు.
మూడేళ్ల లీజ్.. అసలు కారణం ఇదే!
అయితే అల్లు అర్జున్ ఈ ఇంటిని మూడేళ్ల పాటు లీజుకు తీసుకోవడం వెనుక బలమైన సినీ కారణాలు ఉన్నాయి. బన్నీ లైనప్‌లో ఉన్న అగ్ర దర్శకుల చిత్రాలే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాబోతున్న ‘రాకా’ (Raaka) సినిమా షూటింగ్ మెజారిటీ భాగం ముంబైలోనే జరగనుంది. దీని తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ కూడా ముంబై కేంద్రంగానే సాగే అవకాశం ఉంది.
అందుకే ప్రయాణ భారంతో పాటు హోటల్ బస ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బన్నీ ఈ ‘డ్యూయల్ సిటీ’ లైఫ్‌ని ఎంచుకున్నారని సమాచారం. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అల్లు అర్జున్, ఈ ముంబై నివాసం ద్వారా నేషనల్ లెవల్‌లో తన పట్టును మరింత బిగించబోతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు..