Reading Time: < 1 minute

తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు ప్రమోషన్లు

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు ప్రమోషన్లు దక్కాయి. 1995, 1996 బ్యాచ్ ఐపీఎస్లకు పదోన్నతి పొందారు. ఆరుగురు ఐపీఎస్లు అడిషనల్ డీజీ నుంచి డీజీలుగా పదోన్నతి పొందడం విశేషం.

ప్రమోషన్లు పొందిన అధికారుల్లో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్తో పాటు ఐదుగురు సీనియర్ ఐపీఎస్లు ఉన్నారు. పదోన్నతి పొందిన అధికారుల్లో.. వీవీ శ్రీనివాస్ రావు (1995), స్వాతి లక్రా (1995), మహేష్ భగవత్ (1995), చారుసిన్హా (1996), డా. అనిల్ కుమార్ (1996), వీసీ. సజ్జనార్ (1996) ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.