
గంగా సప్తమి వచ్చేసింది. గంగా దేవి పునర్జన్మకు నిదర్శనంగా.. గంగా జయంతి అని కూడా జరుపుకుంటారు హిందూవులు. ఈ ఏడాది 2026, ఏప్రిల్ 23వ తేదీ సప్తమి రోజున.. గంగా సప్తమిగా గంగా నదికి ప్రత్యేక పూజలతోపాటు.. పవిత్రమైన గంగా స్నానం చేస్తారు హిందూవులు.
గంగా సప్తమి ముహూర్త సమయం :
గంగా సప్తమి తిధి ప్రారంభ సమయం : ఏప్రిల్ 22వ తేదీ రాత్రి 10 గంటల 49 నిమిషాలు
గంగా సప్తమి తిధి ముగింపు సమయం : ఏప్రిల్ 23వ తేదీ రాత్రి 8 గంటల 49 నిమిషాలు
గంగా సప్తమి ముహూర్తం : ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 38 నిమిషాల వరకు
గంగా సప్తమి కథ ఏంటీ అంటే :
గంగా సప్తమికి పురాణాల్లో విశేషమైన కథ ఉంది. గంగా నది స్వర్గం నుంచి భూమిపైకి అవతరించింది. ఆ సమయంలో గంగా దేవి శక్తివంతమైన ప్రవాహానికి భూమి నాశనం అవుతుందన్న భయంతో.. ప్రపంచాన్ని రక్షించేందుకు పరమ శివుడు సంకల్పించారు. శివుడు తన జటాజూటంలో గంగా దేవిని బంధఇంచి.. శాంతంగా భూమిపైకి విడిచి పెట్టాడు.
గంగా నది తన ప్రయాణంలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని తుడిచిపెట్టేస్తుంది. ఆశ్రమాన్ని నాశనం చేసిందన్న కోపంతో.. గంగా నది నీరంతా తాగేస్తాడు జహ్ను మహర్షి. విషయం తెలుసుకున్న భగీరథ మహారాజు, దేవతలు ప్రార్థనలు చేస్తారు. గంగా నదిని విడుదల చేయాలని జహ్ను మహిర్షిని వేడుకుంటారు. శాంతించిన జహ్ను మహిర్షి.. గంగా నదిని తన చెవి నుంచి బయటకు విడుదల చేస్తాడు. అది సప్తమి రోజు.. దీంతో ఈ మాసంలో వచ్చే సప్తమిని గంగా సప్తమి అంటారు. అదే విధంగా గంగా నదిని జాహ్నవి అని కూడా పిలుస్తారు.
గంగా సప్తమి రోజు ఇంట్లో ఏం చేయాలి :
గంగా సప్తమి రోజు.. ఏప్రిల్ 23వ తేదీన తెల్లవారుజామునే గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. గంగా నదిలో స్నానం చేయటం సాధ్యం కాకపోతే.. గంగా జలం కలపటం ద్వారా మంచి జరుగుతుంది. గంగా నది మీ దగ్గరలో లేకపోతే నదీ స్నానం చేసినా పుణ్యమే. ఇంట్లోనే గంగా మాతకు పువ్వులతో దీపాలు వెలిగించి.. పాలు, పండ్లు నైవేధ్యంగా సమర్పించాలి. గంగా స్త్రోత్రం పఠించటం ద్వారా శాంతి చేకూరుతుంది. గంగా సప్తమి రోజు పేదలకు ఆహారం, దుస్తులు దానం చేయటం ద్వారా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
Also Read : ధైర్యమంటే ఏంటీ.. ధైర్యవంతులు అని ఎవర్ని అంటారు
గంగా సప్తమి రోజు నదీ స్నానం చేసినా.. పూజలు చేసినా పాప ప్రక్షాళన జరుగుతుందని.. ఆత్మను పవిత్రం చేస్తుందని నమ్ముతారు. గంగా మాతను పూజిస్తే శాంతి, శ్రేయస్సుతోపాటు ఖర్మల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. .
జహ్ను మహర్షి ద్వారా గంగా నది పునర్జన్మతో భూమిపైకి వచ్చింది కాబట్టి.. దీన్ని గంగా సప్తమి అంటారు. గంగా జయంతి అని కూడా పిలుస్తారు. మంచి జరగాలని కోరుకునే వారు గంగా సప్తమి ముహూర్తంలో పూజ చేయండి.. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేయటం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి.