Reading Time: < 1 minute

గాల్లోనే గుండె పోటు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Caption of Image.

హైదరాబాద్: దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్న ఏజ్‎లోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‎తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్టే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్‎లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 

విమానంలో ప్రయాణిస్తోన్న వ్యక్తికి గుండె పోటుతో మృతి చెందాడు. వివరాల ప్రకారం.. బుధవారం (ఏప్రిల్ 23) ఒడిషా రాజధాని భువనేశ్వర్ నుంచి ఓ విమానం బెంగళూర్ వెళ్తుంది. ఈ క్రమంలో విమానంలోని ఓ ప్రయాణికుడు గుండె పోటుకు గురయ్యాడు. గమనించిన పైలట్ విమానాన్ని వెంటనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ప్రయాణికున్ని ఎయిర్ పోర్టు నుంచి ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడి వివరాలు తెలియాల్స ఉంది.

©️ VIL Media Pvt Ltd.