
మహబూబాబాద్, వెలుగు: విద్యతోపాటు సామాజిక అంశాలపై విద్యార్థిని, విద్యార్థులు అవగాహన కల్పించాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మహత్మాజ్యోతి బాపూలే స్కూల్‌ను ఆమె పరిశీలించారు.
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్‌లో ప్రతిభ కనబరిచిన పిల్లలను సన్మానించి, ప్రశంసా పత్రాలు అందించారు. రోడ్డు భద్రత, డ్రగ్స్ నివారణ సామాజిక అంశాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారిని అభినందించారు. పిల్లలకు భోజనం రెడీ చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలను పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, జడ్పీ సీఈవో పురుషోత్తం, ప్రిన్సిపల్ రాజేశ్పాల్గొన్నారు.