
మహబూబాబాద్ (గార్ల), వెలుగు: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మంగళవారం గార్ల మండల కేంద్రంలో రూ.12,78,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. 45 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
కాగా, జామా మజీద్ కమిటీ సభ్యులుషాదీ ఖానా నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలం ఉన్నందున ముస్లిం మైనార్టీల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ కమ్ షాదీ ఖానా నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు తదితరులున్నారు