
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మె ప్రభావంతో బస్ డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బుధవారం ఉదయం నుంచే బస్టాప్ లు, బస్టాండ్ల దగ్గర ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. బస్సులు నడవక ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే సెలవుల్లో స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చింది.అయితే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. అద్దె బస్సులను యధావిధిగా నడుస్తు్న్నాయి. అయితే ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. హైదరాబాద్ సిటీలో పోలీస్ బందోబస్తుతో బస్సులను డిపోలనుంచి పంపిస్తోంది. రోడ్లపైకి వచ్చిన బస్సులను సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు అడ్డుకునేందుక ప్రయత్నిస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులు కదలక పోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని ప్రైవేట్ వాహనాలలో ప్రాయాణాన్ని కొనసాగిస్తున్నారు.
సమ్మె కారణంగా ఉప్పల్ ఆర్టీసీ బస్సులు బస్ డిపో కే పరిమితమయ్యాయి. అధికారుల ఒత్తిడితో ఇద్దరు ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, ఇద్దరు పర్మనెంట్ కండక్టర్లలో ఉప్పల్ డిపో నుంచి 4 బస్సులను రెండు 115 కోటి సర్వీసులు, ఒకటి300, ఒకటి 113 మెహదీపట్నం సర్వీసు బస్సులను రోడ్డెక్కించారు. ఇప్పటి వరకు నాలుగు బస్సులు ఉప్పల్ డిపో నుంచి వెళ్ళాయి. మిగిలిన బస్సులు ఉప్పల్ డిపోకే పరిమితం అయ్యాయి.
మరోవైపు ఫలక్ నుమా, ఫారూఖ్ నగర్ బస్సు డిపోలలో కూడా ఇదే పరిస్థితి.బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే కొన్ని బస్సులను పోలీస్ ప్రొటెక్షన్ తో రోడు పైకి పంపిస్తున ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ సమ్మె కారణంగా ముషీరాబాద్ లో ఆర్టీసీ బస్సులు డిపోలనుంచి బయటికి రాలేదు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా సమ్మె ప్రభావం కొనసాగుతోంది. డిపోలో మొత్తం 120 బస్సులు ఉంగా.. రెండు బస్సులను పోలీస్ ప్రొటెక్షన్ తో బయటికి పంపించారు. డిపోలో 80 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా 59 బస్సులు రోడ్డెక్కించారు.
బర్కత్ పురా బస్ డిపో దగ్గర కూడా సమ్మె ప్రభావం కనిపిస్తోంది. ప్రేవేట్ సిబ్బందితో మూడు బస్సులను రోడ్డెక్కించారు. 113 మెహదీపట్నం , 216 ,218 కోఠి నుంచి పఠాన్ చెరువు రూట్లతో ఈ సర్వీసులను నడిపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిపో వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.