Reading Time: < 1 minute

USB కిల్లర్ అంటే ఏమిటి? మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసారో ఖతమే..!

Caption of Image.

మీకు ఎక్కడైనా ఆఫీసులో లేదా ఇంట్లో, మరెక్కడైనా ఎవరిదో తెలియని USB పెన్ డ్రైవ్ కనిపిస్తే, దానిని వెంటనే మీ ఫోన్‌కు గానీ, ల్యాప్‌టాప్‌కు గానీ అస్సలు కనెక్ట్ చేయకండి. అది చూడటానికి మామూలు పెన్ డ్రైవ్‌లాగే ఉన్నా, అది మీ డివైజ్‌ను క్షణాల్లో పనికిరాకుండా చేసే ‘USB కిల్లర్’ కావచ్చు.

ఏంటి ఈ USB కిల్లర్?
ఇది కేవలం డేటాను దొంగిలించేది కాదు, మీ డివైజ్ భౌతికంగా నాశనం చేసే ఒక ప్రమాదకరమైన గ్యాడ్జెట్. కంప్యూటర్లు, పీసీలు, ఫోన్లను సెకన్లలో కాల్చేయడానికి దీనిని ప్రత్యేకంగా తయారు చేస్తారు.

ఇది ఎలా పనిచేస్తుంది?
మీరు ఈ పెన్ డ్రైవ్‌ను ప్లగ్ చేయగానే, అది మీ ల్యాప్‌టాప్ లేదా ఫోన్ నుండి కొద్దిగా విద్యుత్తును తీసుకుంటుంది. అలా తీసుకున్న కరెంటును లోపల ఉండే కెపాసిటర్లలో స్టోర్ చేసి దాని వోల్టేజ్‌ను విపరీతంగా పెంచేస్తుంది. ఇలా ఒక్కసారి పవర్ ఫుల్ ఛార్జ్ అవ్వగానే, ఆ హై-వోల్టేజ్ కరెంటును తిరిగి ఒకేసారి మీ డివైజ్ లోకి వదిలేస్తుంది.

ALSO READ : బయటపడ్డ బజాజ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ మోసం.. 

ఈ  హై-వోల్టేజ్ ఎలెట్రిక్ షాక్ కి  మీ ల్యాప్‌టాప్ లోని మదర్‌బోర్డ్ ఇంకా ఇతర ముఖ్యమైన భాగాలు వెంటనే  కాలిపోతాయి. ఇది సాఫ్ట్‌వేర్ సమస్య కాదు, హార్డ్‌వేర్ సమస్య. ఒక్కసారి ఇది దాడి చేస్తే, మీ డివైజ్‌ను మళ్లీ రిపేర్ చేయడం దాదాపు అసాధ్యం.

గుర్తుంచుకోండి ఫ్రీగా దొరికిందని లేదా ఎవరిదో తెలుసుకుందామని తెలియని పెన్ డ్రైవ్‌లను వాడితే, వేల రూపాయల మీ ల్యాప్‌టాప్ లేదా ఫోన్ చెత్తబుట్టలోకి చేరడం ఖాయం. అందుకే ఇతరుల పెన్ డ్రైవ్‌లను వాడే ముందు ఎప్పుడూ ఒకటికి రెండుసార్లు ఆలోచించి వాడండి. 
 

©️ VIL Media Pvt Ltd.