
చెన్నై: సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్విజయ్ ఎన్నికల అఫిడవిట్లలో రూ.100 కోట్లకు పైగా వ్యత్యాసం ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని మద్రాస్ హైకోర్టు ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చి(ఈస్ట్), పెరంబూర్ నియోజకవర్గాల నుంచి విజయ్పోటీ చేస్తున్నారు.
అయితే, ఈ రెండు స్థానాలకు సంబంధించి విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లలో అతని ఆదాయంలో వ్యత్యాసం ఉందని ఆరోపిస్తూ పెరంబూర్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తిరుచ్చి నుంచి దాఖలు చేసిన పత్రాల్లో విజయ్తన ఆదాయం రూ.220 కోట్లుగా పేర్కొన్నారు. పెరంబూర్ సీటు కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌లో రూ. 115 కోట్లుగా చూపించారు. దీంతో ఈ భారీ వ్యత్యాసంపై స్పందించాలని మద్రాస్ హైకోర్టు ఇన్కమ్ట్యాక్స్విభాగానికి ఆదేశాలు జారీ చేసింది.