
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికే ఈ క్రేజీ కపుల్స్కి ‘మీర్’ అనే ముద్దైన కుమారుడు ఉన్నాడు. మీర్ జనవరి 2023లో జన్మించగా.. ఇవాళ ఏప్రిల్ 20, 2026న, అతడు అన్నయ్య పాత్రలోకి అడుగుపెట్టాడు.
ఈ శుభవార్తను ప్రియ అట్లీ దంపతులు తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అట్లీ “Feeling blessed” అని రాసి, ఒక క్రియేటివ్ నోట్‌ను పోస్ట్ చేశారు. అందులో “ఏప్రిల్ 20, 2026న.. నాకు ఒక చిన్న చెల్లి పుట్టింది!.. & ప్రియా మరియు అట్లీ, ఒక పాపకు తల్లిదండ్రులమయ్యాం” అని ఎమోషనల్ క్యాప్షన్తో అనౌన్స్ చేసి ఆసక్తి పెంచారు.
Feeling blessed 💞💞💞💞💞@priyaatlee pic.twitter.com/tQgPKbQZbi
— atlee (@Atlee_dir) April 20, 2026
అదేవిధంగా, అట్లీ కుమారుడు మీర్.. తన చెల్లిని కలవాలని ఆసక్తిగా ఉన్నట్లు ఒక చిలిపి డ్రాయింగ్ కూడా ఉంది. ఈ సందేశం పూర్తిగా ప్రేమతో నిండి ఉండడంతో, కొద్ది నిమిషాల్లోనే అభిమానులందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే అభిమానులు, సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సమంత, దీపికా పడుకొణె, కాజల్ అగర్వాల్, అనన్య పాండే తదితరులు సోషల్ మీడియాలో తమ అభినందనలు తెలిపారు. అభిమానులు కూడా ఈ దంపతులకు మరియు పాపకు ప్రేమతో ఆశీర్వాదాలు అందిస్తున్నారు.
ఇకపోతే అట్లీ- ప్రియా 2014లో వివాహం చేసుకున్నారు. 2023 జనవరిలో మీర్ జన్మించాడు. ఇప్పుడు పాప పుట్టడంతో వారి కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి.
Also Read : కష్టాల్లో ఉన్నవారికి ‘మెగా’ భరోసా
అట్లీ ‘రాకా’:
డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం ‘రాకా’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరియు దీపికా పడుకొణె నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అట్లీ రూపొందిస్తున్నారు.
ఈ సినిమాను ఒక ‘పారలల్ యూనివర్స్’ (Parallel Universe) కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారని టాక్. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం ఏకంగా రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.ఇందుకోసం అంతర్జాతీయ స్టూడియోలతో అట్లీ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం బడ్జెట్ రూ.700 కోట్లు దాటే అవకాశం ఉంది.
#Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.
It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs
— atlee (@Atlee_dir) April 8, 2026