Reading Time: 2 minutes

ఏసీ కొనాలనుకుంటున్నారా? ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్: ఏది బెస్ట్?

Caption of Image.

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలకు ఏసీ లేనిదే గడవదు. ఎండ వేడి, ఉక్కపోతను తట్టుకోవాలంటే నగరాల నుంచి పల్లెల వరకూ అందరూ ఏసీలను వినియోగించటం సర్వ సాధారణంగా మారిపోయింది. అయితే మార్కెట్‌లోకి వెళ్తే ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీల మధ్య ఏది కొనాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ రెండింటి మధ్య తేడాలను తెలుసుకుంటూ.. మీ కుటుంబానికి ఏది కరెక్ట్ అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పనితీరులో తేడా ఏంటి?
సాధారణ నాన్ ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ కేవలం ఆన్ లేదా ఆఫ్ మోడ్‌లో మాత్రమే పనిచేస్తుంది. అంటే గది చల్లబడగానే కంప్రెసర్ ఆగిపోతుంది. మళ్లీ రూమ్ వేడెక్కగానే పూర్తి శక్తితో స్టార్ట్ అవుతుంది. దీనివల్ల కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇన్వర్టర్ ఏసీ అలా కాదు. ఇది ఒక కార్‌ యాక్సిలరేటర్‌లా పనిచేస్తుంది. గది చల్లదనాన్ని బట్టి కంప్రెసర్ స్పీడ్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. పూర్తిగా ఆగిపోదు. దీనివల్ల గది ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా కొనసాగుతుంది.

కరెంట్ బిల్లు, సేవింగ్స్..
మీరు ఏసీని రోజుకు 5 నుండి 6 గంటల కంటే ఎక్కువ సమయం వాడుతుంటే.. కళ్లు మూసుకుని ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం బెస్ట్. ఇది నాన్ ఇన్వర్టర్ ఏసీతో పోలిస్తే దాదాపు 30% నుంచి 50% వరకు విద్యుత్ ఆదా చేస్తుంది. ప్రారంభంలో ఇన్వర్టర్ ఏసీ ధర కొంచెం ఎక్కువగా అనిపించినా.. కేవలం రెండు మూడు ఏళ్లలోనే ఆదా అయ్యే పవర్ బిల్లు ద్వారా ఆ డబ్బు తిరిగి వెనక్కి పొందొచ్చు. రోజూ 2 నుంచి 3 గంటలు మాత్రమే ఏసీ వాడేవారికి నాన్ ఇన్వర్టర్ ఏసీలు సరిపోతాయి. 

Also Read : వేసవిలో పండ్లు, కూరగాయాలతో.. 

ఎలాంటి ఫ్యామిలీలకు ఏది సెట్ అవుతుంది?
చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఇన్వర్టర్ ఏసీ సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా ఒకేలా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావు. అలాగే ఇన్వర్టర్ ఏసీలు పనిచేసేటప్పుడు శబ్దం చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి ప్రశాంతమైన నిద్ర కోరుకునే వారికి ఇది బెస్ట్. ఒకవేళ మీరు అద్దె ఇంట్లో ఉంటూ.. తరచుగా ఇళ్లు మారుతుంటే లేదా గెస్ట్ రూమ్ కోసం ఏసీ కావాలనుకుంటే తక్కువ రేట్లలో దొరికే నాన్ ఇన్వర్టర్ ఏసీలను కొనుక్కోవచ్చు.

మెయింటెనెన్స్ అండ్ లైఫ్..
ఇన్వర్టర్ ఏసీలో సెన్సార్లు, సర్క్యూట్ బోర్డులు కాస్త కాంప్లికేటెడ్ గా ఉంటాయి. కాబట్టి రిపేర్ వస్తే ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుంది. అయితే నాన్ ఇన్వర్టర్ ఏసీల రిపేర్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కానీ మన్నిక విషయంలో ఇన్వర్టర్ ఏసీ కంప్రెసర్‌పై లోడ్ తక్కువగా ఉండటం వల్ల అది ఎక్కువ కాలం మన్నుతుంది. మీ అవసరాలను బట్టి.. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆలోచించి సరైన ఏసీని సెలెక్ట్ చేసుకుని కొనుక్కోండి.

©️ VIL Media Pvt Ltd.