Reading Time: 2 minutes

థియేటర్ vs ఓటీటీ: బిగ్ స్క్రీన్పై మలయాళ సూపర్ హిట్.. OTTలో 20కి పైగా మూవీస్.. డోంట్ మిస్!

Caption of Image.

తెలుగు సినీ ప్రియులకు వినోదాన్ని పంచేందుకు కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. ప్రతివారం లాగే ఈ వారం కూడా (ఏప్రిల్ 24, 2026న) ఆడియన్స్ని అలరించడానికి కొత్త సినిమాలు వస్తున్నాయి. అయితే, ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పకోవడానికి సాలిడ్ తెలుగు కంటెంట్ లేకపోవడం నిరాశ కలిగించే విషయం. కేవలం ఒక్క మలయాళ సూపర్ హిట్ మూవీ మాత్రం తెలుగులోకి వస్తుండటం కాస్తా ఉపశమనం కలిగించే విషయం.

ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం మంచి వైబ్ ఉన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. డిజిటల్ స్క్రీన్స్‌పై ఏకంగా 20కి పైగా  కొత్త సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లలోనూ కంటెంట్ అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని చెప్పుకోవాలి. ఆ లిస్ట్ ఏంటో ఓ లుక్కేయండి..

థియేటర్ సినిమాలు:

‘గేదెల రాజు’:

సంగీత దర్శకుడు రఘు కుంచె టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించిన చిత్రం  ‘గేదెల రాజు’. కాకినాడ తాలూక అనేది  క్యాప్షన్.   చైతన్య మోటూరి దర్శకత్వంలో  వాణి రవికుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఏప్రిల్ 24న సినిమా విడుదల కానుంది. ‘‘చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు’ అనేది మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీ లైన్. ఒక మర్డర్ మిస్టరీని ఇంట్రెస్టింగా తెరకెక్కించినట్లు టాక్. ఈ చిత్రానికి రఘు కుంచెనే సంగీతం కూడా అందిస్తున్నాడు.

‘వాజా 2’:

మలయాళంలో ఊహించని రీతిలో విజయం సాధించిన చిత్రం ‘వాజా 2’. బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రదర్స్ అనేది క్యాప్షన్. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మూవీని  ఏప్రిల్‌ 24న తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. కేవలం రూ.10 నుంచి 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, రూ.200 కోట్లు (గ్రాస్) వసూలు చేసి సత్తా చాటింది. 

సవిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి ప్రధాన పాత్రలు పోషించారు. పాఠశాల జీవితం, స్నేహం, తండ్రి-కొడుకుల బంధం చుట్టూ సాగే ఈ కథ సాధారణ కుర్రాళ్ల జీవితాలను ప్రతిబింబించడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. 

‘మైఖేల్’:

లెజెండరీ స్టార్, పాప్ సంగీత సామ్రాజ్యానికి తిరుగులేని రారాజు ‘మైఖేల్ జాక్సన్’ బయోపిక్ రానుంది. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రాన్ని కేవలం విజయగాథలా కాకుండా, మైఖేల్ జీవితంలోని చీకటి కోణాలను కూడా స్పృశించినట్లుగా సమాచారం. ఈ మూవీ ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 

ఓటీటీ సినిమాలు: 

జీ5

బ్యాండు మేళం (తెలుగు రొమాంటిక్ మూవీ) – ఏప్రిల్ 24

జిరాక్స్ (కన్నడ సిరీస్) – ఏప్రిల్ 24

నెట్‌ఫ్లిక్స్

రెజల్ మేనియా- (స్పోర్ట్స్ సిరీస్) – ఏప్రిల్ 19

అన్ చూజన్ – (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 21

హల్క్ హోగన్: రియల్ అమెరిన్ – (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఏప్రిల్ 22

స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 – (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 23

అపెక్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 24 

అమెజాన్‌ ప్రైమ్‌

ఫ్రమ్‌ 4 – (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్)- ఏప్రిల్‌ 19

కెవిన్‌ – (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్)- ఏప్రిల్ 20

కిల్లింగ్‌ గ్రౌండ్స్‌: ది గిల్గో బీచ్‌ మర్డర్స్‌ (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌)- ఏప్రిల్‌ 22

హ్యాపీరాజ్‌- (తమిళం/తెలుగు)- ఏప్రిల్‌ 24

నాటీ బిజినెస్‌- (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌)- ఏప్రిల్‌ 24

జియో హాట్‌స్టార్‌

బ్రూక్లిన్ నైన్ నైన్ – (ఇంగ్లీష్ కామెడీ సిరీస్) – ఏప్రిల్ 20

24 – (హిందీ సిరీస్‌)- ఏప్రిల్‌ 24

ప్రతిఛాయ – (మలయాళ మూవీ)- ఏప్రిల్‌ 24

లయన్స్ గేట్ ప్లే

గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్)- ఏప్రిల్ 24

ఆపిల్ టీవీ ప్లస్

క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 22

మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 24

©️ VIL Media Pvt Ltd.