Reading Time: < 1 minute

అభినవ గోబెల్స్ సీఎం రేవంత్ రెడ్డి..అబద్ధాల పునాదులపైనే సీఎం అయ్యారు: బండి సంజయ్‌‌

Caption of Image.

కరీంనగర్, వెలుగు: అబద్ధాలు, మోసాలనే నమ్ముకున్న సీఎం రేవంత్ రెడ్డి ‘అభినవ గోబెల్స్’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అబద్ధాల పునాదులపైనే సీఎం అయ్యారని ఒక ప్రకటనలో విమర్శించారు. ‘6 గ్యారంటీలకు తూట్లు పొడిచారు. మాజీ సీఎం కేసీఆర్ తరహాలోనే దొంగ  హామీలు, అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలనను సాగిస్తున్నారు.

  చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడితే ఇండియా కూటమి నేతలు అడ్డుకున్నారు. విష ప్రచారం చేసి బిల్లును అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.’ అని మండిపడ్డారు.

©️ VIL Media Pvt Ltd.