Reading Time: < 1 minute

పెద్ది స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ లో సంయుక్త

Caption of Image.

ఓ వైపు ఫిమేల్‌‌‌‌‌‌‌‌  లీడ్‌‌‌‌‌‌‌‌గా,  హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే మరోవైపు  స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌తోనూ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను అలరించడానికి రెడీ అవుతోందట సంయుక్త మీనన్.   రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ‘పెద్ది’ చిత్రంలోని  స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌లో  ఆమె కనిపించనుందట. ఈ పాట కోసం ఇప్పటికే మృణాల్ ఠాకూర్ సహా  పలువురు స్టార్  హీరోయిన్ల  పేర్లు వినిపించగా, ఫైనల్‌‌‌‌‌‌‌‌గా సంయుక్తను  ఫిక్స్ చేశారట మేకర్స్.  

త్వరలోనే ఈ సాంగ్ షూట్‌‌‌‌‌‌‌‌ జరగనుందని, దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తికానుందని తెలుస్తోంది.  జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ పాన్- ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో శివ రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న విడుదల  కావాల్సిన ఈ సినిమా జూన్‌‌‌‌‌‌‌‌కు వాయిదా పడింది. 

మరోవైపు సంయుక్త  ‘గువ్వల చెరువు ఘాట్‌‌‌‌‌‌‌‌’ అనే వెబ్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌తోపాటు  నిఖిల్‌‌‌‌‌‌‌‌కు జంటగా నటించిన ‘స్వయంభు’,  పూరి జగన్నాథ్  డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో విజయ్ సేతుపతికి జంటగా ‘స్లమ్ డాగ్ 33  టెంపుల్ రోడ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్స్ పూర్తిచేసుకుని విడుదలకు  సిద్ధంగా ఉన్నాయి.  అలాగే తను లీడ్ రోల్ చేసిన ‘బ్లాక్ గోల్డ్‌‌‌‌‌‌‌‌’ కూడా షూటింగ్‌‌‌‌‌‌‌‌ చివరి దశకు చేరుకుంది. 

©️ VIL Media Pvt Ltd.