Reading Time: < 1 minute

అహింసా మార్గంతోనే సమాజంలో శాంతి : వీహెచ్పీ రాష్ట్ర ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

Caption of Image.
  • వీహెచ్​పీ రాష్ట్ర ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి 

మియాపూర్, వెలుగు: ప్రపంచానికి శాంతి మార్గం అత్యంత అవసరమని, అహింసా మార్గంతోనే అది సాధ్యమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి పేర్కొన్నారు. అక్షయ తృతీయ దినోత్సవం సందర్భంగా ఆదివారం మియాపూర్ వైశాలీనగర్‌‌‌‌లో అఖిల భారత జైన్ మహిళా పరిషత్ అధ్యక్షురాలు శిల్పా జైన్ ఆధ్వర్యంలో అహింసా స్తూపం ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. 

ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడారు. అహింసా మార్గమే సమాజానికి శాశ్వత పరిష్కారమని, ప్రతి ఒక్కరూ హింసను త్యజించి అహింసా సిద్ధాంతాన్ని ఆచరించాలని సూచించారు. సమాజంలో శాంతి నెలకొల్పడంలో జైన తత్వం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జైన్ సమాజ పెద్దలు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.