Reading Time: < 1 minute

భద్రాచలం సీతారామయ్యకు అభిషేకం, స్వర్ణ పుష్పార్చన

Caption of Image.

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. వేదపారాయణాలు చేసి, స్వామికి విశేష హారతులను సమర్పించారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. మూలవరులను అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన జరిపించారు.

కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకొచ్చారు. స్వామికి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం సమర్పించారు. 103 జంటలు ఈ క్రతువులో పాల్గొన్నాయి. సెలవు రోజు కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో రావడంతో క్యూలైన్లు రద్దీగా మారాయి. 

©️ VIL Media Pvt Ltd.