
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి రానుంది. ఈ మ్యాచులో భారీ టార్గెట్ పెట్టి లక్నోపై ఒత్తిడి పెట్టాలని లక్ష్యంతో పంజాబ్ బరిలోకి దిగుతుంది.
లక్నో సూపర్ జెయంట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. ఇక్కడ ప్రత్యర్థి జట్టు నిర్దేశించే లక్ష్యాన్ని ఛేదించడం మాకు ఇష్టం.. పంజాబ్ ఈ టోర్నీలో అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉంది, కానీ ఇది మాకు స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని ఇస్తుంది.. జట్టులో ఒక మార్పు చేశాం.. దిగ్వేశ్ రాఠీ స్థానంలో సిద్ధార్థ్ జట్టులోకి వచ్చాడని పంత్ వెల్లడించారు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మేము ముందుగా బ్యాటింగ్ చేయలేదు, కాబట్టి ఇది మాకు ఒక మంచి సవాలు.. జట్టు మెరుగుపడుతున్నప్పుడు అది ‘మాలో మాకే’ పోటీ అని నేను భావిస్తాను.. అజేయంగా కొనసాగాలనే పట్టుదలతో ఉన్నాం.. మేము పాత జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని అయ్యర్ పేర్కొన్నారు.
►ALSO READ | RR vs KKR: వైభవ్, జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే!
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (కెప్టెన్/ వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్
పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
🚨Toss update from New Chandigarh🚨@LucknowIPL won the toss and elected to bowl first against @PunjabKingsIPL
Updates ▶️ https://t.co/u5eUR1eqdA#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG pic.twitter.com/gcucxWBMZJ
— IndianPremierLeague (@IPL) April 19, 2026