Reading Time: < 1 minute
Toxic Business Yash Enters The Distribution Sector Telugu Rights Fetch A Massive Price

పాన్-ఇండియా స్టార్ యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ విడుదల కాకముందే వ్యాపార వర్గాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్, డిజిటల్ బిజినెస్ డీల్స్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. నటుడిగానే కాకుండా ఈ చిత్రంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్ అడుగుపెడుతున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’ ద్వారా కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యష్, సినిమా లాభాల్లో వాటాతో పాటు కర్ణాటక ప్రాంత పంపిణీ హక్కులను తన వద్దే ఉంచుకున్నారు. కన్నడలో అతిపెద్ద స్థాయిలో థియేట్రికల్ రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నాడు యష్.

ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించి థియేట్రికల్ పంపిణీ హక్కులను ప్రముఖ  నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఏకంగా  రూ. 120 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఒక నాన్ -తెలుగు చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు లభించిన బిజినెస్ డీల్స్‌లో ఇది హయ్యెస్ట్ ధర అనే చెప్పాలి. ఈ సినిమా డిజిటల్ హక్కుల రేసు నుంచి డిజిటల్ దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను దక్కించుకోవడానికి జీ స్టూడియోస్ చర్చలు జరుపుతోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ తో అంచనాలను పెంచిన ఈ సినిమా ఈనెల 26న రిలీజ్ కానుంది.  థియేటర్ బిజినేస్ లో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.