
విలక్షణ చిత్రాలతో హీరోగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఆయుష్మాన్ ఖురానా.. త్వరలో ‘పతి పత్ని ఓర్ వో దో’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇందులో సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి హీరోయిన్స్‌గా నటించారు. ముదస్సర్ అజీజ్ దర్శకుడు. టీ-సిరీస్, బి.ఆర్. స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
‘వేటగాడు వేటగా మారాడు’ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌లో ఆయుష్మాన్ ఓ వలలో చిక్కుకోగా పక్కన ఓ చిరుతపులి కనిపిస్తోంది. ఆ వలను ముగ్గురు అమ్మాయిలు పట్టుకున్నట్టుగా పోస్టర్ డిజైన్ చేశారు.
ముగ్గురు అమ్మాయిల ప్రేమ వల నుంచి ప్రజాపతి పాండే (ఆయుష్మాన్) ఎలా బయటపడ్డాడు అనే అడ్వంచరస్ కాన్సెప్ట్‌తో సినిమా ఉండబోతోందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఏడేళ్ల క్రితం కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చిన ‘పతి పత్ని ఔర్ వో’ చిత్రానికి ఇది సీక్వెల్. మే 15న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.