Reading Time: < 1 minute

418 తలుపు తడితే భయం 

Caption of Image.

దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్‌‌ సంస్థ ఓ హారర్ సినిమాను నిర్మిస్తోంది. కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ‘పతంగ్‌‌’ ఫేమ్ ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  శనివారం ఈ మూవీకి ‘418’ అనే టైటిల్‌‌ను ఫైనల్ చేశారు. 

‘418’ అనే నెంబర్‌‌‌‌ రాసి ఉన్న తలుపు, దానిపై రక్తపు చారికలతో డిజైన్‌‌ చేసిన టైటిల్ పోస్టర్‌‌‌‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో సైన్స్, మూఢనమ్మకానికీ అర్ధం కాని ఒక సీక్రెట్‌‌తో, సరికొత్త కథనాలతో గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌పీరియన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండబోతోందని మేకర్స్‌‌ తెలియజేశారు.  శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.