
మహిళ రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం బ్రూణ హత్య లాంటిది.. ప్రతిపక్షాలు కావాలనే మహిళా కోటాను అడ్డుకున్నాయి.నారీ శక్తి బలపడకుండా కుట్ర చేశాయి. ఇది ఇంతటితో ఆగిపోదు.. మహిళల హక్కులకోసం పోరాటం కొనసాగిస్తామన్నారు ప్రధాని మోదీ.
దేశ ప్రజలనుద్దేశించి శనివారం ఏప్రిల్ 18, 2026 సాయంత్రం 8.30 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగించారు. లోక్ సభలో మహిళా కోటా బిల్లు వీగిపోవడంపై ప్రజలకు వివరించారు. చరిత్రాత్మకమైన మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తీ బలపడకుండా కావాలనే విపక్షాలు కుట్ర పన్నాయి.. ప్రతిపక్షాలు మహిళా బిల్లును అడ్డుకోవడాన్ని బ్రూణ హత్యతో పోల్చారు. ఇది ఇంతటితో ఆగిపోదు..మహిళల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రధాని మోదీ అన్నారు. లోక్ సభలో బిల్లు వీగిపోయినందుకు క్షమాపణలు చెప్పారు ప్రధాని.
కాంగ్రెస్ , డీఎంకే సహా ప్రతిపక్ష పార్టీలు కుట్రతో మహిళా కోటాను అడ్డుకున్నాయన్నారు ప్రధాని. నారీ శక్తి బలపడకుండా కావాలనే అడ్డంకులు సృష్టించారన్నారు. బిల్లు వీగిపోతే విపక్షాలు సంబురాలు చేసుకోవడం బాధాకరమన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ విపక్షాల కుట్రలు గుర్తించారన్నారు.చరిత్రాత్మకమైన మహిళా బిల్లును అడ్డుకున్నందుకు ప్రతిపక్షాలు బాధపడక తప్పదన్నారు మోదీ. ప్రజల తీర్పునుంచి విపక్షాలు తప్పించుకోలేవన్నారు ప్రధాని.
వికసిత్ భారత్ లో మహిళ భాగస్వామ్యం కాదనలేనిది..ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి మహిళ కోటా బిల్లు చాలా అవసరమన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడం బ్రూణ హత్య లాంటిదన్నారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ పార్టీలు ఈ హత్యలో భాగమయ్యాయన్నారు.చరిత్రలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ద్రోహులుగా మిగిలిపోక తప్పదన్నారు. ఇండియా కూటమి పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. దేశ ప్రజల మధ్య కాంగ్రెస్ విద్వేషాలు పెంచుతోందని తీవ్రంగా విమర్శించారు ప్రధాని మోదీ.