Reading Time: < 1 minute

మహిళల స్వప్నాన్ని చిదిమేశారు.. దేశ మహిళలకు క్షమాపణలు: ప్రధాని మోడీ

Caption of Image.

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి.. మహిళల స్వప్నాన్ని చిదిమేశారు.. అందుకు దేశంలోని మహిళలందరికి నేను క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని మోడీ అన్నారు. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో శనివారం (ఏప్రిల్ 18) ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. 

‘‘మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రయత్నించాయో దేశం మొత్తం చూసింది. మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ స్వార్థ రాజకీయాలకు మహిళా లోకం బలైంది. నారీశక్తిని ఎదగకుండా అడ్డుకున్నారు. మహిళల కలలను ప్రతిపక్షాలు ధ్వంసం చేశారు. మహిళా బిల్లును ఓడగొట్టి విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మహిళా రిజర్వేషన్లు అడ్డుకొని విపక్షాలు పాపం చేశాయి. 

అడ్డుకోవడం మహిళల ఆత్మాభిమానంపై జరిగిన దాడి. తమకు జరిగిన అన్యాయాన్ని మహిళలు ఎప్పటికీ మరిచిపోరు. రిజర్వేషన్లను అడ్డుకున్న వారిని మహిళలు తప్పకుండా శిక్షిస్తారు. ఇది భ్రూణహత్యలతో సమానం. ఈ భ్రూణ హత్యలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే  తదితర పార్టీలు పాలుపంచుకున్నాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ కుటుంబ పార్టీలు. 

వాళ్లు మహిళలను ఎదగనీయరు. రిజర్వేషన్ల కోసం మహిళలు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఎంతో నిజాయితీతో తెచ్చిన బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మహిళా కోటా బిల్లును వ్యతిరేకించడంలో ప్రతిపక్షం చేసిన పాపానికి శిక్ష తప్పదు’’ అని ప్రధాని మోడీ హెచ్చరించారు.

 

©️ VIL Media Pvt Ltd.