Reading Time: 2 minutes

ఉప్పల్‌లో ‘అభిషేక్’ విధ్వంసం, క్లాసెన్ క్లాస్.. CSK ముందు భారీ టార్గెట్

Caption of Image.

SRH vs CSK: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా SRH vs CSK మధ్య జరుగుతున్న పోరులో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఒక దశలో స్కోరు 220 దాటుతుందని అనిపించినా, చెన్నై బౌలర్లు చివర్లో అద్భుతంగా పుంజుకున్నారు. 

అభిషేక్, క్లాసెన్ క్లాసీ బ్యాటింగ్: 
ఇన్నింగ్స్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ ఊచకోత మొదలుపెట్టాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది రికార్డులు తిరగరాశాడు. ట్రావిస్ హెడ్ (23)తో కలిసి పవర్‌ప్లేలోనే 75 పరుగులు జోడించి ఉప్పల్ స్టేడియాన్ని దద్దరిల్లజేశాడు. అయితే, ముఖేష్ చౌదరి వేసిన ఒకే ఓవర్లో హెడ్, కెప్టెన్ ఇషాన్ కిషన్ (0) అవుట్ కావడంతో ఆరెంజ్ ఆర్మీకి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. అలాగే వికెట్లు పడుతున్నా అభిషేక్ శర్మ (59) తన అటాకింగ్ ఆపలేదు.. కానీ జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ (59) తనదైన స్టైల్‌లో సిక్సర్ల వర్షం కురిపించి స్కోరును 150 దాటించాడు. నితీశ్ కుమార్ రెడ్డి (12), సలీల్ అరోరా (13) ఈ మ్యాచ్‌లో మరోసారి నిరాశపరిచారు.

చెన్నై బౌలర్ల మ్యాజిక్: 
ఇక 15 ఓవర్ల వరకు హైదరాబాద్ జోరు చూస్తే స్కోరు భారీగా ఉండేలా కనిపించింది. కానీ అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్ డెత్ ఓవర్లలో అదిరిపోయే బౌలింగ్‌తో హైదరాబాద్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. సెట్ అయిన క్లాసెన్‌ను క్లీన్ బౌల్డ్ చేయడమే కాకుండా, శివాంగ్ కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్‌లను వెనక్కి పంపి మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ, నితీశ్ రెడ్డి, అనికేత్ వర్మలని ఔట్ చేసిహైదరాబాద్ మిడిల్ ఆర్డర్ నడ్డి విరిచాడు జేమీ ఓవర్టిన్.. అయితే ముఖేష్ చౌదరి మాత్రం ఆరంభంలోనే 2 వికెట్లు తీసి హైదరాబాద్ కి బిగ్ షాక్ ఇచ్చాడు. 

©️ VIL Media Pvt Ltd.